జబర్దస్త్ హైపర్ ఆది అచ్యుతాపురం మండలంలో తిమ్మరాజుపేట, హరిపాలెం, అచ్యుతాపురం, మోసయ్యపేట, రామన్నపాలెం, రోడ్ షో ప్రచారం జన ప్రవాహం కొనసాగింది. ఆది మాట్లాడుతూ సీఎం జగన్ ఇంట్లోనే మంచి జరగలేనప్పుడు రాష్ట్రంలో ఎక్కడ మంచి జరిగిందని అన్నారు. జగన్ చెల్లెలుకు న్యాయం కోసం పోరాడి రోడ్లు మీద తిరుగుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు గాలికి వదిలేశారు. మద్యపానం నిషేధం అన్నారు. మద్యం డబ్బులతో కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఫ్యాను ఇంట్లో ఒకట్లో ఉండాలి, నాలుగులో ఉండాలి, జగన్ మాయ మాటలు నమ్మి అప్పుడు ఫ్యాన్ స్పీడ్ 151 లో పెట్టాం. అందుకే జగన్ పేదల జీవితాలతో విద్యుత్ బిల్లులు పెంచి మధ్యతరగతి ప్రజలను మోసం చేశారు. మహిళలకు బటన్ నొక్కితే పదివేలు పడుతున్నాయి అంటున్నారు. మగవాళ్ళు మాత విప్పితే 30 వేలు పోతున్నాయని ఎద్దేవా చేశారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఓడించి ఎలమంచిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ని గెలిపించి, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నిగెలిపించాలని ప్రజలకు ప్రజలకు అభివాదం చేశారు.
హైపర్ ఆది ప్రచారంలో మండల కేంద్రం జన సంద్రంలా మారింది. హైపర్ ఆది మాటలతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్లో ఉత్సాహం కనిపించింది. సుందరపును భారీ మెజార్టీతో గెలిపించి కోరారు. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు చిత్తుచిత్తుగా ఓడించి.. ఎలమంచిలిలో కూటమి జెండా రెపరెపలాడి, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రచార రథం పై ఎలమంచిలి టీడీపీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరావు, సుందరపు, సీఎం రమేష్, నాయకులు బైలపూడి రామదాసు, తదితరులు పాల్గొన్నారు.