ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ‘ఎయిర్‌బస్ బెలూగా’ నిన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ‘వేల్ ఆఫ్ ద స్కై’ అని పిలిచే ఈ ఎయిర్‌బస్ ఎ300-608ఎస్టీ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. అంతకుముందు ఇది మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. థాయిలాండ్ వెళ్తూ ఇంధనం నింపుకునేందుకు ఇక్కడ ఆగింది.ఈ ఆకాశ తిమింగలం ప్రయాణం ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టౌలౌస్ విమానాశ్రయం నుంచి మొదలైంది. అయితే ఎయిర్‌బస్ బెలూగా హైదరాబాద్‌కు రావడం ఇది మూడోసారి. డిసెంబర్ 2022, ఆగస్ట్ 2023లో రెండుసార్లు శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని 1995లో తొలిసారి పరిచయం చేశారు. సాధారణ కార్గో విమానాలు మోయలేనంత సరుకును ఇది ఇట్టే ఎగరేసుకుపోతుంది.