Current Date: 27 Nov, 2024

వంతెనపై విరిగిన బస్సు స్టీరింగ్ కానీ లక్ ఏంటంటే?

ఎవరైనా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంటే.. భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అని సాధారణంగా మన పెద్దవాళ్లు అంటుంటారు. ఈ సామెతలో చెప్పినట్లే.. తెలంగాణలో ఓ 13 మంది తృటిలో ప్రాణాలు కాపాడుకున్నారు.సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం దిగ్వాల్‌లోని పిరామల్‌ పరిశ్రమకు చెందిన ఈ బస్సు జహీరాబాద్‌లో 12 మంది ఉద్యోగులను ఎక్కించుకుంది. రాంనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వరకు రాగానే బస్సు స్టీరింగ్‌ సడన్‌గా విరిగిపోయింది. దాంతో బస్ అదుపు తప్పింది.అప్పటికే వంతెపై ఉన్న బస్సు అటు ఇటు తిరిగి చివరికి వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి అదృష్టవశాత్తు ఆగిపోయింది. కానీ.. బస్సు ముందు భాగం మాత్రం వంతెన  నుంచి బయటకు వేలాడింది. అదృష్టవశాత్తూ డ్రైవర్‌తో పాటు ఉద్యోగులెవరూ గాయపడలేదు. ఈ యాక్సిడెంట్ తీరు చూసిన ప్రయాణికులు  మీకు ఇంకా భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అంటూ ఉద్యోగులను బస్‌ నుంచి కిందకి దించారు.

Share