Current Date: 06 Oct, 2024

విశాఖలో గాలి వాన బీభత్సం

విశాఖలో బుధవారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు పడి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడిరది. వరద నీరు రహదారిపై ప్రవహించి పరిస్థితి అధ్వానంగా మారింది.  ఈదురు గాలుల దెబ్బకు రేకులు ఎగిరిపడ్డాయి. భారీకేడ్లు రోడ్లపైకి వచ్చిపడిపోయాయి. అలాగే గాలులకు టెంట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది.

Share