ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయం ముందు మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. నిత్యం ఏదో ఒక ఆలయాన్ని సందర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్న అఘోరి... సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని పోలీసులు మహిళా అఘోరిని రాష్ట్రం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీంతో మహిళా అఘోరి నేడు అకస్మాత్తుగా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. స్వామి వారి దర్శనం కోసం వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన మహిళా అఘోరి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లబోనని, అవసరమైతే ఆత్మార్పణ చేసుకుంటానని బెదిరించారు. అయినా పోలీసులు గుడి లోపలికి అనుమతించకపోవడంతో కారు వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్థానిక మహిళలతో కలిసి అఘోరిపై నీళ్లు కుమ్మరించారు