బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. వరుసగా యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత.. క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొన్న అదానీ వ్యవహారంలో స్పందించారు. ఆ తర్వాత వాంకిడి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై స్పందించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఇప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు కవిత ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.