Current Date: 28 Sep, 2024

సుప్రీంకోర్టు ఆదేశాలపై కోల్ కతా వైద్యుల అసంతృప్తి...

కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేటి సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని, లేకుంటే బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవచ్చని సీజేఐ ధర్మాసనం డెడ్ లైన్ విధించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తోటి వైద్యురాలికి జరిగిన దారుణానికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళనల నుంచి వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. తమది ప్రజాందోళన అనేది ఇటు ప్రభుత్వం కానీ, అటు సుప్రీంకోర్టు కానీ విస్మరించలేదని అన్నారు. ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచారం కేసు కలకత్తా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి మారిందని గుర్తుచేస్తూ.. అయినా కూడా న్యాయం మాత్రం ఇప్పటికీ జరగలేదని జూనియర్ డాక్టర్ల ప్రతినిధి వాపోయారు.

Share