Current Date: 07 Jul, 2026

అక్కినేని అఖిల్‌కి జూనియర్ ఎన్టీఆర్ సాయం.. హిట్ పడేనా?

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం దాటిపోయింది. అయినప్పటికీ.. తన మార్క్ హిట్‌ను ఇప్పటి వరకూ అందుకోలేకపోయాడు. తాజాగా ‘లెనిన్’ చిత్రంతో ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు అఖిల్ రాబోతున్నాడు.  ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అభిమానుల్ని అలరిస్తుందని అక్కినేని ఫ్యామిలీ బలంగా చెప్తోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. శివాజీ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో చిత్ర బృందం ప్రేక్షకులకు ఒక అదిరిపోయే క్రేజీ అప్‌డేట్‌ను అందించింది. ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కథా నేపథ్యమైన ‘శ్రీరామపురం’ ఊరిని, అక్కడి పరిస్థితులను తారక్ తన గంభీరమైన గాత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్ ప్రక్రియను ఎన్టీఆర్ ఇప్పటికే పూర్తి చేశారు. అఖిల్ మాస్ మేకోవర్, ఎన్టీఆర్ పవర్ ఫుల్ వాయిస్ తో తోడవడంతో ‘లెనిన్’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మరి చూడాలి.. ఈసారైనా అఖిల్‌కి సాలిడ్ హిట్ పడుతుందేమో!