రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య ‘విముక్తి’ అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ, పుష్పకుమారి కోరారు. అక్రమరవాణా బాధిత మహిళలకు నష్టపరిహారం అందించడంతో పాటు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందేలా చేసి కమ్యూనిటీ ఆధారిత పునరావాసం పేరుతో ప్రత్యేకంగా ఒక పథకం రూపొందించాలని కోరారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్ లో బాధిత మహిళలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా లేకరుల సమావేశంలో విముక్తి రాష్ట్ర నాయకులు అపూర్వ, పుష్పకుమారి మాట్లాడుతూ అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధిత మహిళల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి అనిత దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
Share