Current Date: 26 Nov, 2024

నటి శ్రీరెడ్డికి బిగ్ షాక్...ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు...

నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకుగాను శ్రీరెడ్డిపై మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనితలపై గతంలో శ్రీరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టారని నిర్మల తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దళిత మహిళ అయిన హోంమంత్రి అనితపై శ్రీరెడ్డి అసభ్యకరకంగా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అలాగే మరిన్ని సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు సమాచారం.

Share