Current Date: 06 Jul, 2024

బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ

విశాఖలో బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి పడిన తాపత్రయం మనసుల్ని కలిచి వేసింది. KGHలో శిరీష అనే గర్భిణి నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చింది. శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. అక్కడికి తీసుకెళ్లేందుకు సిబ్బంది లేకపోవడంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ నర్సు వెనకాల నడిచారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Share