కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. కాంట్రాక్టర్ల బిల్లుల నిమిత్తం విచ్చల విడిగా అప్పులు చేస్తున్నారని సీఈసీకి తన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటేసిందన్న ఆయన.. ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం అప్పులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారు. చేసిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.