తమిళనాడులోని తెలుగువారిపై అనుచిన వ్యాఖ్యలు చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న సినీ నటి కస్తూరికి ఊరట లభించింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా ఆమె విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. దీంతో, హైదరాబాద్ లో ఉన్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ఎగ్మోర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమెకు ఈనెల 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ దయాళన్ ఆమెకు బెయిల్ మంజూరు చేశారు.