Current Date: 27 Nov, 2024

విలేకరిపై రజనీకాంత్‌ అసహనం...

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. గతంలో ఈయన రాజకీయ రంగ ప్రవేశం వుంటుందని అందరూ ఊహించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన అభిమానులకు తెలియజేసిన సంగతి తెలిసిందే. కేవలం సినిమాలు, ఆరోగ్యంపై దృష్టి సారించిన రజనీకాంత్‌ తాజాగా రాజకీయాలపై ఎదురైన ఓ ప్రశ్నకు విలేకరిపై మండిపడ్డాడు. ఇటీవల చెన్నయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయ్‌నిధి స్టాలిన్‌ పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారంలో వుంది. దీనిపై మీ కామెంట్‌ ఏమిటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా 'పాలిటిక్ప్‌కు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఇబ్బంది పెట్టొద్దని మీకు ఇంతకు ముందే చెప్పానుగా' అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రజనీకాంత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Share