Current Date: 26 Nov, 2024

తల్లి కావాలని ఉంది .. సమంత షాకింగ్ కామెంట్స్

సీనియర్ హీరోయిన్ సమంత తల్లి కావాలని తాను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటానని చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. అయితే.. ఇప్పుడు తల్లి కావాలని అనుకోవడం మరీ ఆలస్యమని నేను అనుకోవడం లేదని సమంత చెప్పుకొచ్చింది.సిటాడెల్‌‌లో తల్లి పాత్రలో నటించాను. చైల్డ్‌ ఆర్టిస్ట్‌తో వర్క్‌ చేయడం డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆ పాపతో సెట్‌లో ఉన్నన్ని రోజులు నా సొంత కూతురుతో ఉన్నట్లుగానే అనిపించేది అని సమంత గుర్తు చేసుకుంది.‘మాతృత్వానికి వయసు అడ్డు కాదని నేను నమ్ముతాను. తల్లిగా ఉండటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను. అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అది ఒక అద్భుతమైన అనుభవం. ఆ సమయం నా జీవితంలోనూ వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఈ వయసులో తల్లి కావడం ఏంటని అంటారేమో.. అది పెద్ద అవరోధం అని నేను భావించడం లేదు’ అని సమంత అన్నారు.నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలతో బిజీ అయ్యారు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే.

Share