Current Date: 28 Nov, 2024

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీలో విస్తారంగా వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడిరచింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడిరచారు. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నేడు అన్ని పాఠశాలలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో స్నానాలు, ఈతకు, చేపల వేటకు వెళ్లొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు.

Share