విశాఖ బీచ్‌లో ఆదివారం చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎంఆర్, ‘ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ’ సంయుక్త ఆధ్వర్యంలో ‘చేనేత చీర నడక’ (హ్యాండ్లూమ్ శారీ వాక్) ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. రన్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సందడి చేశారు. ఆదివారం ఉదయం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి మూడు కిలోమీటర్ల మేర నిర్వహించిన రన్‌కు విశేష స్పందన లభించింది. ఆర్‌కె బీచ్ రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి ఆదివారం ఉదయం నిర్వహించిన పాదయాత్రను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ, డైరెక్టర్ మావూరి హారిక, వీఎస్‌ఈజెడ్ రోషిణి, స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసెటీ సంస్ధ అధ్యక్షుడు వై.సిహెచ్.దొరబాబు, సొసైటీ కార్యదర్శి డాక్టర్ శ్రీమతి సుధా పద్మశ్రీ, కోశాధికారి సంగీత, తదితర సోసైటీ సభ్యులు, ప్రారంభించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడం, నడక ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం, మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ నడకలో మహిళలు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిటీలో వున్న వాకర్స్ ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చేనేత చీర నడకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళల గొప్పతనాన్ని దేశానికి చాటుతూ విశాఖ మహానగరం కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడెంపజేశారు. నగర నలుమూలల నుండే కాకుండా ఉభయ రాష్ట్రాలకు చెందిన అనేక సంస్థల ప్రముఖ మహిళలు ఈ రన్‌లో భాగస్వాములయ్యారు. వేలాది మంది బీచ్ రోడ్డులో నడవడంతో ఆ ప్రాంతం రహదారి చీరకట్టిన చందంగా కనువిందు చేసింది.
Share