Current Date: 05 Oct, 2024

రేపు కలెక్టర్ల సమావేశం

జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది. సోమవారం సాయంత్రం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ఎజెండాను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో 5న సచివాలయంలో జరిగే కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై తొలి చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు. ఆయా అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్లు ఇస్తారు. వారి ప్రాధాన్యాలు, లక్ష్యాలను కలెక్టర్ల ముందు ఉంచుతారు. మధ్యాహ్న విరామం తర్వాత బడుగు, బహీనన వర్గాల సంక్షేమంపై చర్చ ఉంటుంది. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ, సీజనల్‌ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, పురపాలన, సీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్‌, జలవనరులు, పౌరసరఫరాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సాయంత్రం రెవెన్యూశాఖపై చర్చ జరగనుంది.

Share