ఇజ్రాయిల్-యూఎస్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మండలిని కూడా ఏర్పాటు చేశారు. కాగా ఇరాన్ సుప్రీం ఆయతుల్లా అలీ ఖుమేనితో పాటు మొత్తం 40 మంది టాప్ కమాండర్స్ మృతి చెందారు. దీంతో ఇరాన్ తదుపరి లీడర్ ఎవరే సస్పెన్స్ కొనసాగింది. ఈ సస్పెన్స్‌కు తాజాగా తెరపడింది. సీనియర్ మతాధికారి ఆయతుల్లా అలీరేజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ప్రకటించారు. అయతుల్లా అలిరేజా అరాఫీని తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడిగా ఎక్స్‌పెడియెన్సీ డిస్సర్న్‌మెంట్ కౌన్సిల్ ఎన్నుకుంది. అయితే ఈ విషయాన్ని ఎక్స్‌పెడియెన్సీ కౌన్సిల్ ప్రతినిధి మొహ్సేన్ డెహ్నావి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖమేని చనిపోయిన తర్వాత ఇరాన్ రాజ్యంగం ఆర్టికల్ 111ను యాక్టివ్ చేశారు. దీని ప్రకారం ఇరాన్‌లో అత్యవసర నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. శాశ్వత సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ముగ్గురు సభ్యుల కౌన్సిల్ సుప్రీం లీడర్ అధికారాలను స్వీకరిస్తారు. ఈ కౌన్సిల్‌లో భాగమైన అలిరేజా అరాఫీ... అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలం-హోస్సేన్ మొహ్సేని-ఎజెయ్‌లతో కలిసి దేశాన్ని నడిపిస్తారని తెలుస్తోంది.
Share