ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా.. ఈ రెండు దేశాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతుడోంది. దీంతో ఆ దేశాలకు వలస వెళ్లిన ప్రజలు క్షణం క్షణం భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌కు చెందిన పలువురు ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నారు. టెల్ అవీవ్‌లో ఆర్మూర్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ భయంతో బంకర్లలో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని బంధువులకు వీడియోల ద్వారా బాధితులు తెలియజేశారు. వారు తలదాచుకున్న చోటుకి ఇప్పటివరకు ఎనిమిది మిస్సైళ్లు దూసుకొచ్చాయని వీడియోల ద్వారా చెప్పుకొచ్చారు. మరోవైపు, ఇరాన్, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అందరినీ స్వదేశానికి రప్పించాలని కోరారు. గల్ఫ్ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణమే ఇన్ఫామ్ చేయాలని సూచించారు. సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Share