ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. మళ్లింపు తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికుల సంరక్షణ కోసం సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తోందని ఎయిర్ ఇండియా ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొంది. ‘ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు నడుపుతున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ-183 సాంకేతిక కారణాల వల్ల రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (యూఎన్‌కేఎల్) మళ్లించబడిరది’’ అని ఎయిర్ ఇండియా పోస్ట్‌లో తెలిపింది. గత 13 నెలల్లో ఎయిర్ ఇండియా విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ కావడం ఇది రెండోసారి.