Current Date: 26 Nov, 2024

రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో రెండోసారి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. 2016లో ఒక రమ్య అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న క్రిష్.. 2018లో భార్య‌తో విడిపోయారు. ప్రీతి చల్లాకి కూడా గతంలోనే వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తోంది. 2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కమర్షియల్ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది. పవన్‌తో 'హరిహర వీరమల్లు' సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండేసరికి ఆ సినిమా నుంచి తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Share