Current Date: 28 Nov, 2024

ఏపీ హోంమంత్రి ఇలాకాలో తాగునీటి కోసం మహిళలు ఆందోళన

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండల కేంద్రం  పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు రోడ్డెక్కారు. ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రతినిధ్యం వహి స్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని  కోటవురట్ల మేజర్ పంచాయతీలో గత వారం రోజులుగా కొళాయిలు ద్వారా తాగునీటి సర ఫరా నిలిచిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాగునీటి పైపు లైన్లు దెబ్బతినటం తో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై గ్రామస్తులు అధికారులకు మొరపెట్టు కున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆగ్రహం చెందిన మహిళలు.. గ్రామ సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగునీటి సరఫరా చేయకపోతే కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ..వారం రోజు లుగా త్రాగటానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మొర పెట్టుకుందామని సచివాలయానికి వెళితే, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని మహిళలు వాపోతున్నారు. దీంతో సుదూ ర ప్రాంతాలకు వెళ్ళి నీటిని తెచ్చుకోవలసి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Share