ఐపీఎల్ 2024లో ఇప్పుడు అందరి చూపు ముంబయి ఇండియన్స్ వైపు ఉంది. ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఐదు సార్లు టైటిల్‌ను అందించిన రోహిత్ శర్మను కాదని కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను.. అది కూడా గుజరాత్ టైటాన్స్ టీమ్ నుంచి ఎదురు డబ్బు ఇచ్చి మరీ తీసుకురావడంపై ముంబయి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దానికి తోడు ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మని గ్రౌండ్‌లో అవమానించేలా హార్దిక్ పాండ్య ప్రవర్తించడం ఫ్యాన్స్‌కి కోపం తెప్పించింది.
హార్దిక్ పాండ్య గతంలో ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడినవాడే. కెరీర్ ఆరంభంలో ముంబయి టీమ్‌లో ఉన్న పాండ్యాని రెండేళ్ల క్రితం మంబయి టీమ్ అతను సరిగా ఆడటం లేదని వేలంలోకి వదిలేసింది. దాంతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుని.. కెప్టెన్‌ను కూడా చేసింది. హార్దిక్ కూడా నమ్మకాన్ని నిలబెడుతూ 2022లో గుజరాత్‌కి టైటిల్‌ను అందించాడు. దాంతో ముంబయి కన్ను మళ్లీ హార్దిక్‌పై పడింది.
2013 నుంచి కెప్టెన్‌గా ముంబయి టీమ్‌ను రోహిత్ నడిపిస్తున్నాడు. ఇప్పుడు అతడ్ని పక్కన పెట్టి మళ్లీ టీమ్‌లోకి వచ్చిన హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడమేంటి? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గ్రౌండ్‌లో కూడా రోహిత్ శర్మను ఇబ్బందిపెట్టేలా హార్దిక్ పాండ్య తరచూ అతని ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ మార్చడం.. ఏదైనా సూచన ఇవ్వడానికి రోహిత్ వస్తే చీదరించుకోవడం ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోంది. దాంతో సోషల్ మీడియా వేదికగా రోహిత్,హార్దిక్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడుస్తోంది. టోర్నీ జరిగేకొద్దీ ఇది ఏ స్థాయికి చేరుతుందో?