వాతావరణ మార్పుల కారణంగా చెన్నై నగరంలో ‘మద్రాసు ఐ’ ప్రబలుతోంది. గత నెల చివరి వారం నుంచే ఈ వ్యాధి వ్యాప్తిచెందుతోందని, బాధితులు వైద్యులను సంప్రదించి మందులు వాడాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. కంటి వాపు, ఎర్రబడడం, కంటి నుంచి నీరు కారడం వంటివి మద్రాసు ఐ లక్షణాలు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కండ్ల కలక కేసులు అధికమవుతుంటాయి. ప్రస్తుతం నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా కండ్ల కలక వ్యాధి వ్యాప్తిస్తోంది. ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించని పక్షంలో తీవ్రమైన సమస్యగా మారుతుందని వైద్యలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి గురైన వారు అధికంగా మెడికల్ షాపులకు వెళ్లి యాంటీ బయాటిక్స్ వాడుతుంటారని, కానీ తగ్గకపోవడంతో అప్పుడు ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులంటున్నారు. అలాకాకుండా కంటి వైద్యుడిని సంప్రదించి వారి సూచనల మేరకు యాంటీబయాటిక్స్, కంటి చుక్కల మందు వినియోగించాలని వారు సూచిస్తున్నారు
Share