భారత్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తాను ఎప్పటికీ క్షమించనని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి నిప్పులు చెరిగాడు. యువరాజ్‌కి కెరీర్‌లో ధోనీ నమ్మక ద్రోహం చేశాడని యోగ్‌రాజ్ చెప్పుకొచ్చాడు. ‘ధోనీని నేను ఎప్పటికీ క్షమించను. నిజమే అతను చాలా ఫేమస్ క్రికెటర్. కానీ.. నా కుమారుడు యువరాజ్ సింగ్‌కు చేసిన అన్యాయం మాత్రం క్షమించరానిది. అతడు ఏం చేశాడో ప్రతిదీ ఇకపై వెలుగులోకి వస్తోంది’ అని యోగ్‌రాజ్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా కొడుకు యువరాజ్ కనీసం మరో నాలుగేళ్లు క్రికెట్ ఆడేవాడు. కానీ అతని కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడు. క్యాన్సర్ బారిన పడ్డ నా కుమారుడు మళ్లీ క్రికెట్‌లోకి రాడని గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వారు కూడా అన్నారు. కానీ క్యాన్సర్‌తో పోరాడుతూనే దేశం కోసం ఆడి ప్రపంచ కప్ గెలిపించినందుకు యువరాజ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి’ అని యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. 2019 జూన్ 10న అంతర్జాతీయ క్రికెట్‌కు యువీ గుడ్‌బై చెప్పేశాడు.