ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎట్టకేలకి చెన్నై సూపర్ కింగ్స్ గాడినపడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే.. గత కొన్ని మ్యాచ్‌లుగా భారీ స్కోర్లు చేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్న హైదరాబాద్ మళ్లీ తడబాటుకి గురవుతోంది. మరీ ముఖ్యంగా బ్యాటింగ్‌లో హిట్ లేదా ఫట్ అనే స్థాయిలో హైదరాబాద్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి.
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. నిజానికి గత కొన్ని మ్యాచ్‌లుగా సునాయసంగా 250 మార్క్‌ని దాటేస్తున్న హైదరాబాద్‌కి ఇది పెద్ద లక్ష్యం కాదు. కానీ.. చెన్నైతో మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌటైపోయింది. టీమ్‌లో ఒక్కరు కూడా కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోయారు. ప్లేఆఫ్స్ ముంగిట హైదరాబాద్‌ను కంగారుపెట్టే అంశమే ఇది.
తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన చెన్నై టీమ్ ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. నాలుగో ఓటమితో హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయిం