సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబు పేట్ మండలం, ఎక్ మామిడి గ్రామపంచాయతీ పరిధిలో అలీ ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఫిర్యాదు అందింది. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో గ్రామ సెక్రెటరీ శోభారాణి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 5న ఒక నోటీసు ఇవ్వగా.. ఈ నెల 22న మరోసారి నోటీసు అందజేశారు. నోటీసు ఇచ్చే సమయంలో ఆలీ లేకపోవడంతో ఆ ఫామ్‌హౌస్‌లో పని చేసే వారికి నోటీసు అందించామని శోభారాణి చెప్పారు.
Share