Current Date: 26 Nov, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తమిళనాడుకు తుపాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురానికి ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.

Share