Current Date: 27 Nov, 2024

అనంతపురం జిల్లాలో అరుదైన పుట్టగొడుగు

పుట్టగొడుగులు సాధారణంగా చాలా చిన్నవిగా ఉంటాయి. పది పుట్టుగొడుగులు కలిపినా 5 వందల గ్రాముల బరువు ఉండవు. కానీ అనంతపురం జిల్లా, కుందిర్బి మండలం, జానం పల్లిలో రైతు వడ్డే హనుమంతరాయుడు వ్యవసాయ పొలంలో 5 కిలోల బరువు ఉన్న పుట్టగొడుకు లభించింది. సహజసిద్ధంగా భూమిలో నుంచి ఈ పుట్ట గొడుకు బయటకు వచ్చింది. ఇంత పెద్ద పుట్టుగొడుగును తానెప్పుడూ చూడలేదని రైతు హనుమంతరాయుడు చెప్పాడు. ఆ పుట్టగొడుగుని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. పరిశోధన కోసం ఆ పుట్టగొడుగును మండల వ్యవసాయాధికారి మహేష్‌ కు రైతు అప్పగించాడు. దాన్ని కల్యాణ దుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రానికి తరలించారు.

Share