Current Date: 05 Oct, 2024

జాబ్‌ మేళాకు విశేష స్పందన విశాఖలోని షాదీఖానాలో ఇంటర్వ్యూలు

ముస్లిం ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం అక్కయ్యపాలెంలోని షాదీఖానాలో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ ముస్లిమ్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ అల్‌ హజ్‌ రహమతుల్లాప్‌ా బేగ్‌ మాట్లాడుతూ, అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహించామని, పలు కంపెనీల్లో పోస్టుల భర్తీ నిమిత్తం ఈ మేళా ఏర్పాటు చేశామన్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ముస్లిం ప్రొఫెషనల్స్‌, విశాఖ ముస్లిమ్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ వెల్ఫేర్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన  ఈ మేళాకు విశేష స్పందన కనిపించిందన్నారు. కార్యక్రమంలో జోమాటో, కేఎల్‌ గ్రూప్‌, ఐఎఫ్‌బీ, అమెజాన్‌ తదితర కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. పదో తరగతి నుంచి, ఇంటర్‌, డిగ్రీ, ఇతర అర్హతలున్న అభ్యర్థులు హాజరయ్యారు.