Current Date: 17 Aug, 2026

టీచర్లు, ఉద్యోగులపై చంద్రబాబు కక్ష: జగన్

ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పట్ల కూటమి ప్రభుత్వం కక్షగట్టిందని వైఎస్ జగన్ ఫైరయ్యారు. 'ఐదుగురు టీచర్లను సస్పెండ్ చేశారు. టెట్ నిబంధన వల్ల సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. దాని నుంచి మినహాయించాలని కోరుతూ ఎంపీలతో కలిసి కేంద్రానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా? వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి టీచర్లకు క్షమాపణ చెప్పండి. అటు ఉద్యోగుల PRC, IR, DAలు ఏమయ్యాయ్' అని Xలో ప్రశ్నించారు.