వాయవ్య బంగాళాఖాతం నుంచి బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు వర్షాలు కురుస్తాయంది. APలో ఇవాళ SKL, VZM, PLV, విశాఖ, ELR, NLR, TPT జిల్లాల్లో, TGలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. కొన్ని చోట్ల 30-40KMPH వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.