Current Date: 07 Oct, 2024

తమ పిల్లల కోసం తామే బడి కట్టుకున్న ఆదివాసీలు

చూశారా? ఇక్కడ కష్ట పడి షెడ్ నిర్మిస్తున్న ఆదివాసీలవి కూలి పని చేస్తే తప్ప రోజు గడవని బతుకులు. తమలా తమ పిల్లల జీవితాలు కాకూడదని చేస్తున్న ఆలోచన ప్రతి రూపమే ఈ షెడ్. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయితీ తెంగల్ బంధ ఆదివాసీ కొండ దొర కుటుంబాల కధ ఇది. ఈ గ్రామంలో  ఒకటి నుండి ఐదవ తరగతి చదివే 25 మంది పిల్లలు వున్నారు. కానీ బడికి వెళ్లాలంటే రెండు ఊట గెడ్డలు దాటి రెండున్నర కిలోమీటర్లు నడవాలి. వర్షం పడిందంటే ఈ గెడ్డలు దాటడం అయ్యే పని కాదు. ఆరోజు స్కూల్ కు డుమ్మా కొట్టాల్సిందే. అందుకే గ్రామస్థుల ఆందోళన కు స్పందించిన విద్యా శాఖ అధికారులు ఊర్లో ఒక షెడ్ నిర్మించుకుంటే  ఒక టీచర్ ను పంపుతామని హామీ ఇచ్చారు. దీంతో  తమ అడవి బిడ్డల భవిష్యత్ కోసం ఆదివాసీ లు నడుం బిగించారు. ఊరు ఊరంతా కలసి ఆఘమేఘాల మీద షెడ్ నిర్మాణం చేపట్టారు... ఒక్క రోజులోనే పని పూర్తి చేశారు. చూసారా? ప్రభుత్వం ఎప్పుడో ఈ పని చేస్తుందని ఎదురు చూడకుండా తామే ఈ పని చేసి ఆదర్శంగా నిలిచారు.

Share