Current Date: 27 Nov, 2024

ఉద్యోగులకి మోడీ సర్కార్ శుభవార్త మూడు కొత్త స్కీమ్స్

ఉద్యోగంలో కొత్తగా చేరబోతున్న వారికి మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25కు సంబంధించి వార్షిక బడ్జెట్​‌ను ఈరోజు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్.. బడ్జెట్‌లో యువతను ఆకట్టుకునే దిశగా కొత్త పథకాలను ప్రకటించారు. దేశంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్త ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మూడు స్కీములను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు స్కీమ్‌-ఎ  ఈపీఎఫ్‌వోలో నమోదైన కొత్త ఉద్యోగులకు రూ.15,000 వరకు ఒక నెల జీతం. మూడు విడతల్లో చెల్లింపు స్కీమ్‌-బి మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగులకు, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు. మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్‌ ఆధారంగా చెల్లింపు స్కీమ్‌-సి: అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు రెండేళ్లపాటు రూ.3,000 వరకు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్‌ రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు. నిరుద్యోగుల కోసం ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు పథకాలను ప్రకటించారు. ఈ పథకాలను ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా అమలు చేస్తామని వెల్లడించారు.

Share