Current Date: 26 Nov, 2024

న్యూజిలాండ్ పతనాన్ని శాసించిన సుందర్ రికార్డ్స్ మోత

భార‌త్‌తో పుణెలో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ జట్టు 259 ప‌రుగులకు ఆలౌటైంది. ఆఫ్ స్పిన్న‌ర్లు సుంద‌ర్‌, అశ్విన్ ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు ముప్పు తిప్పులు పెట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్‌ సుందర్ మూడేళ్ల తర్వాత త‌న రీ ఎంట్రీలో స‌త్తాచాటాడు. ఏకంగా 7 వికెట్లు ప‌డ‌గొట్టి కివీస్‌ను దెబ్బ‌తీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్‌ పడగొట్టడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం.న్యూజిలాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు ప‌డ‌గొట్టిన వాషింగ్ట‌న్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో పూణెలోని ఏంసీఎ స్టేడియంలో ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా సుంద‌ర్ నిలిచాడు. ఓవ‌రాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా సుంద‌ర్ నిలిచాడు.సుంద‌ర్ కంటే ముందు ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ స్టీఫెన్ ఒకీఫ్ పుణెలో 5 వికెట్ల హాల్ న‌మోదు చేశాడు. న్యూజిలాండ్‌పై  7 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో భార‌త్‌ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సుంద‌ర్ కంటే ముందు ఎస్ వెంకటరాఘవన్, ఎరపల్లి ప్రసన్న, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.

Share