శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం ఉస్సేన్ సస్పెండ్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ ఆయనని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి డబ్బులు లంచం అడిగిన చరిత్ర ఈయనది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా... సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ అధికారంలో ఉండటంతో విచ్చలవిడిగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలో సమూలంగా ప్రక్షాళన చేయాలనీ అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీతో అంటకాగిన పోలీసులను అధికారులు వీఆర్‌కి పంపారు. ఈ ఘటనతో రెవెన్యూ అధికారుల్లోనూ గుబులు మొదలైంది.