ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం నుంచి ఆసక్తిగా జరుగుతోంది. తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు అత్యధిక ధర వేలంలో లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు వేలంలో దక్కించుకుంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర. ఇక రెండో రెండో భారీ ధర కూడా భారత్‌కి చెందిన మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. తొలి రోజు వేలంలో నాలుగు ఆర్టీఎమ్ కార్డులు (రచిన్ రవీంద్ర (సీఎస్కే), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ), నమన్ ధిర్ (ముంబై), అర్షదీప్ సింగ్ (పంజాబ్) వాడుకున్నాయి. వేలంలో తొలి రోజైన ఆదివారం అన్ని ఫ్రాంచైజీలు మొత్తం రూ. 467.85 కోట్లు ఖర్చు చేయగా.. 72 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సోమవారం కూడా వేలం కొనసాగనుంది.