Current Date: 27 Nov, 2024

నారా లోకేష్‌కి ఒక్క మెసేజ్‌తో ఆ ఊరికి బస్ వచ్చింది

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కి ఒక్క మెసేజ్ పెట్టడంతో ఆ ఊరికి బస్సు వెళ్లింది. పాఠశాలకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని.. తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలన్న విద్యార్థుల అభ్యర్థనతో నారా లోకేష్ స్పందించి ఊరికి బస్సు పంపారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీస్ లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు సర్వీస్ నడపాలని మంత్రి లోకేశ్‌కు విద్యార్థులు మెసేజ్ చేశారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి నారా లోకేష్ తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే మార్లమడికి కొత్త బస్సు సర్వీసును ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు ప్రారంభించారు. దీంతో మంత్రి లోకేశ్‌కు గ్రామస్థులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మంత్రి లోకేశ్ ఇటీవలే తన వాట్సాప్‌కు వచ్చిన ఒక్క మెసేజ్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యలు పరిష్కరించి వారికి ఎన్ఐటీ, ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో వచ్చి తనను కలవాల్సిన అవసరం లేదని.. సమస్యలను పూర్తి వివరాలతో [email protected] మెయిల్ ఐడీకి పంపించాలని నారా లోకేష్ సూచించారు.

Share