Current Date: 26 Nov, 2024

ఆలూ లేదూ చూలూ లేదు..ప్రమాణం రోజు చికెన్‌ పెసరట్టంట!

ఆలూ లేదు, చూలూ లేదు ప్రమాణం రోజు చికెన్‌ పెసరట్టు..అంటూ వైసీపీ నేతలు రోజుకో తీరును ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడకుండానే ప్రమాణ స్వీకారం జూన్‌ 9న అంటూ ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. అదేరోజు ఉదయం అతిథులకు విందు అంటూ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ కమిటీ ఆహార విభాగ చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి పేరిట ఏకంగా  మెనూ ప్రకటించడం వైరల్‌ అయ్యింది. ఇదిగో చూడండి ఆ మెనూలోని వంటకాల జాబితా.అల్పాహారం..మసాలా ఇడ్లీ, ఎమ్మెల్యే పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, పులిహోర, పెరుగు వడ, సాంబార్‌ వడ, మసాలా దోశ, చాక్లెట్‌ దోశ, చక్కెర పొంగల్‌, పాయసం, పోహా వేపుడు, బొబ్లట్లు (ఆంధ్రా స్వీట్‌), పునుగులు.నాన్‌ వెజిటేరియన్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ ఐటెమ్స్‌..చికెన్‌ పెసరట్టు, ఎగ్‌ దోశ, చికెన్‌ దోశ, మటన్‌ ఖీమా దోశ, ఎగ్‌బుర్జీ విత్‌ పావ్‌, మటన్‌ కీమా ఇడ్లీ, చికెన్‌ పొంగల్‌, అరెసలు (ఆంధ్రా స్వీట్‌), బోటీవడ, నాటుకోడి పులుసు, పెసర పునుగులు, మద్రాస్‌ ఫిల్టర్‌ కాఫీ, ఫ్రెష్లీ స్క్వీజ్డ్‌ ఆరెంజ్‌ జ్యూస్‌, కోకోనట్‌ వాటర్‌.వెజిటేరియన్లకు లంచ్‌ మెనూ..గోంగూర పప్పు, బెండకాయ పులుసు, వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, వెజిటేబుల్‌ బిర్యానీ, టమాటో పప్పు, గుత్తి వంకాయ కూర, ఉలవ చారు, ఆంధ్రా ఆవకాయ, దొండకాయ ఫ్రై, ఆలూ కుర్మా, సాంబార్‌, రసం, కర్డ్‌ రైస్‌, పూతరేకులు, బూందీ లడ్డూ.
నాన్‌ వెజ్‌ లంచ్‌ జాబితా..ఆంధ్రా చికెన్‌ కర్రీ, మటన్‌ పలావ్‌, చేపల పులుసు, బొమ్మిడాల పులుసు, నాటు కోడి వేపుడు, టైగర్‌ రొయ్యల ఇగురు, గోంగూర మటన్‌, కోనాం ఫిష్‌ ఫ్రై, చికెన్‌ బిర్యానీ, నాటుకోడి పులుసు, నాటుకోడి చిట్టి ముత్యాల బిర్యానీ, నాటు కోడి రాగి సంగటి, ఖీమా కోఫ్తా కర్రీ, ఎగ్‌ మసాలా కర్రీ, ఖుభానీ కా మీఠా (స్వీట్‌)...బెవరేజెస్‌ ఫర్‌ లంచ్‌..స్పైస్‌ బటర్‌ మిల్క్‌, మ్యాంగో లస్సీ, ఫ్రెష్‌ లైమ్‌ సోడా, తీపి చెక్కలు, బెల్లం జిలేబీలు, బెల్లం లడ్డూలు, తీపి బూందీ మిక్చర్‌, మాడుగుల హల్వా, కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా, 10రకాల ఐస్‌ క్రీంలు, ఫ్రూట్‌ సలాడ్‌, కోల్‌కతా ఆకుతో స్పెషల్‌ చాక్లెట్‌ పాన్‌.