Current Date: 28 Nov, 2024

గోల్డ్ స్మిత్ తెలివికి బ్యాంక్ బురిడీ.. దొరికిపోయాడిలా

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం వైకుంఠాపురంకు చెందిన కేశవరపు రాజేష్ వృత్తి రీత్యా గోల్డ్ స్మిత్. మిర్యాలగూడలో రాజేష్ గోల్డ్ వర్క్స్ పేరుతో ఒక గోల్డ్ షాపుని కూడా గతంలో నిర్వహించాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో గోల్డ్ షాప్‌ను మూసివేసి అప్పులను తీర్చేందుకు కొత్త స్కెచ్ వేశాడు.ఏపీలోని తెనాలి, నెల్లూరులో నకిలీ బంగారు గొలుసుని తయారు చేయించి తనకి తెలిసిన విద్యతో ఆ నకిలీ బంగారంపై హాల్ మార్క్ KDM 916 ముద్రించేవాడు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేసే బ్యాంక్ అప్రయిజర్ జిల్లేపల్లి నరేందర్‌‌తో ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని బ్యాంక్‌ను బురిడీ కొట్టించేశాడు.హాల్ మార్క్ ముద్రించిన నకిలీ బంగారాన్ని బ్యాంకు లోన్ కోసం తీసుకొచ్చే సమయంలో అసలైన బంగారంగా ధ్రువీకరించాలని అప్రైజర్ నరేంద్రతో‌ రాజేష్ ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు కొంత నగదును ఇస్తానని నమ్మబలికాడు. దీంతో తనతోపాటు భార్య, బంధువులు, ఫ్రెండ్స్ పేరిట నకిలీ బంగారాన్ని తనఖా పెట్టాడు. ఈ క్రమంలో పలు దపాలుగా రూ.53.89 లక్షల రూపాయలను రాజేష్ కాజేశాడు. అయితే రాజేష్ డాబు చూసి డౌట్ పడిన గ్రామస్థులు.. బ్యాంక్ అధికారులకి ఉప్పందించారు. 

Share