సూర్య హీరోగా శివ దర్శకత్వంలో దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కంగువ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంతా భావించారు. కంగువ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ మా సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని, జీఎస్టీ లెక్కలతో సహా చూపిస్తాను అంటూ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా నీరసంగా ఉన్నాయి. అంతే కాకుండా టాక్ సైతం మిక్స్‌డ్‌గా ఉండటంతో నిర్మాతలు తెలుగు మార్కెట్ నుంచి ఆశించిన వసూళ్లలో కనీసం 10% సైతం వచ్చే అవకాశం లేదని బాక్సాఫీస్ వర్గాలు అంటున్నాయి. తమిళనాడులో సినిమాకి భారీగా వసూళ్లు దక్కినా వెయ్యి కోట్ల మార్క్ సాధించడం మాత్రం దాదాపు అసాధ్యం. కనుక మరికొంత కాలం తమిళ తంబీలు వెయ్యి కోట్ల వసూళ్ల కోసం వెయిట్ చేయాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క తమిళ్ సినిమా కూడా వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేయలేకపోయింది.
Share