Current Date: 15 Nov, 2024

పార్లమెంట్‌లో హాకా నృత్యం... రచ్చ రచ్చ చేసిన మహిళా ఎంపీ

న్యూజిలాండ్ పార్లమెంట్ లో అతిపిన్న వయస్కురాలైన ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ రచ్చ చేశారు. సంప్రదాయ మావోరీ తెగకు చెందిన హాకా నృత్యం అంటే..మావోరీ సంప్రదాయంలో రౌద్రం, పరాక్రమం కలగిలిపన హావభావాలను ప్రదర్శిస్తూ సాగే నృత్యం ప్రదర్శించి వివాదాస్పద బిల్లు కాపీనీ చింపేసింది. గురువారం న్యూజిలాండ్ పార్లమెంట్ లో అక్కడి ప్రభుత్వం స్వదేశీ ఒప్పంద బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లు కాపీలను 22ఏళ్ల మహిళా ఎంపీతోపాటు మావోరీ తెగకు చెందిన ఎంపీలు బిల్లు కాపీలను చింపేశారు. బ్రిటిష్, స్వదేశీ మావోరీల మధ్య 184 ఏళ్ల నాటి ఒప్పందాన్ని పునర్నిర్వచించే స్వదేశీ ఒప్పంద బిల్లుపై పార్లమెంట్ లో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ కు అంతరాయం కలిగించడానికి మావోరీ ఎంపీ సభ్యులు హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. వారి సీట్లలో నుంచి లేచి తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ స్వదేశీ ఒప్పంద బిల్లును చించేసి తన నిరసనను తెలిపింది.  పరిరక్షించడానికి విస్తృత హక్కులను కల్పిస్తూ వాగ్దానం చేశారు. ఆ హక్కులు న్యూజిలాండ్ దేశస్తులందరికీ వర్తింపజేయాలని బిల్లులో చేర్చడం జరిగిందని తెలుస్తోంది. 

Share