ఎన్డీటీవీ మాజీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌పై కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మూసివేసింది. 2009లో రుణ సెటిల్మెంట్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టాన్ని కలిగించారంటూ వీరిద్దరిపై 2017లో నమోదైన కేసును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి ఏడేళ్ల పాటు దర్యాప్తు సాగించిన సీబీఐ..ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌కి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని కేసును మూసివేస్తూ సీబీఐ తన క్లోజర్ రిపోర్టును సమర్పించింది. క్వాంటమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు చెందిన సంజరు దత్ ఫిర్యాదు మేరకు 2017లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రైతుల ఆందోళనలను, దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వినాశకర విధానాలను ఎండగడతూ కథనాలు ప్రసారం చేస్తుండటంతో ప్రణయ్ రాయ్ నేతృత్వంలోని ఎన్డీటీవీపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతూ వచ్చింది. అయితే 2022లో అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ దొడ్డి దారిన ఎన్డీటీవీని కైవసం చేసుకుంది.
Share