దేశంలో ప్రసిద్ది చెందిన విశాఖ నగరం లోని సింహాచలం పుణ్యక్షేత్రంలో దేవస్థానం వేద పండితుల వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 108 బంగారు సంపెంగలతో శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారికి ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వ ర్యంలో స్వర్ణ పుష్పార్చన గావించారు. అర్చకులు వేకువ జామున సుప్రభాత సేవ తో స్వామిని మేల్కొలిపి, ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించా రు. ఈరోజు గురువారం ఉదయం స్వామి వారి స్వర్ణపుష్పార్చనలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై, స్వర్ణపుష్పార్చణలో పాల్గొని స్వామి వారి సేవలో తరించారు. ఈ సందర్బంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుంద రంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలో వేదికపై అధీష్టింపజేసి, వేద మంత్రాలు నాధస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణ పుష్పార్చ న, సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవ ల్లో పాల్గొని తరించారు.
Share