Current Date: 26 Nov, 2024

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా, ఎల్లుండిలోగా చేయకుంటే డబుల్ టీడీఎస్ కట్

ట్యాక్స్ పేయర్లకు అతి ముఖ్యమైన గమనిక. మే 31 లోగా అంటే మరో రెండ్రోజుల్లో ఆ పని పూర్తి చేయకుంటే మీ జీతం నుంచి రెట్టింపు టీడీఎస్ కట్ అవుతుంది జాగ్రత్త. నమ్మలేకున్నారా..నిజమే. ఇన్‌కంటాక్స్ శాఖనుంచివచ్చినఅలర్ట్ఇది.ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం ఇది. జూలై 31 లోగా ప్రతి ట్యాక్స్ పేయర్ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫామ్ 16 అందగానే ఆ ప్రక్రియ ప్రారంభమౌతుంది. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ కీలకమైన అలర్ట్ జారీ చేసింది. పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో కీలక సూచనలు చేసింది. మే 31వ తేదీలోగా అంటే మరో రెండ్రోజుల్లో పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే టీడీఎస్ రెట్టింపు కట్ చేయాల్సి వస్తుందని ఇన్‌కంటాక్స్ శాఖ హెచ్చరించింది. పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం కోసం ఇప్పటికే చాలా గడువు తేదీలు ముగిసిపోయాయి. ఇప్పుడు మరోసారి మే 31 వరకూ అవకాశమిచ్చింది. దీనికి సంబంధించి ఓ సర్క్యులర్కూడాజారీఅయింది.మే31లోగాపాన్కార్డునుఆధార్కార్డుతోఅనుసంధానించకపోతే ఉద్యోగుల జీతం నుంచి రెట్టింపు టీడీఎస్ కట్ అవుతుంది.ఇదిలా ఉంటే బ్యాంకులు, ఫోరెక్స్ డీలర్లు కూడా మే 31లోగా కీలకమైన పని పూర్తి చేయాల్సి ఉంది. ఆర్ధిక లావాదేవీల స్టేట్‌మెంట్లను ఆదాయపు పన్ను శాఖకు ఎల్లుండిలోగా సమర్పించాల్సి ఉంది. ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్లు, బ్యాంకులు, రిజిస్ట్రార్‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, పోస్టాఫీసులు, మ్యూచ్యువల్ ఫండ్స్ సంస్థలన్నీ ఇన్‌కంటాక్స్ శాఖతో స్టేట్‌మెంట్స్ షేర్ చేయాలి. లేకపోతే అంటే మే 31లోగా చేయకుంటే రోజుకు 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది.