Current Date: 27 Nov, 2024

ఏపీ లో ఇసుక తక్కెడ.. పేడ తక్కెడ

ప్రభుత్వం ఒకపక్క ఇసుక ఉచితం అని ప్రచారం చేస్తున్నా డిపోల దగ్గర మాత్రం టన్ను ఇసుక ఖరీదు 1394 రూపాయలు అంటూ బోర్డులు కనిపిస్తున్నాయికుటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక ఉచితం అని చేసిన ప్రకటన చూసి సంబరపడిపోయారు అందుకు తగ్గట్టుగనే కూటమి ప్రభుత్వం జులై 8 వ తేదీన ఇసుక పాలసీని ప్రకటించింది.టన్ను ఇసుక ధర 375రూపాయలే నంటూ ప్రభుత్వం వెల్లడించింది అయితే తీరా డిపోల దగ్గరకు వెళ్ళేసరికిటన్ను ఇసుక ధర 1394 రూపాయలు అంటూ బోర్డులు కనిపించాయి. ఉచితం అంటే టన్ను 1394 రూపాయల అని అర్ధమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన అంశాల్లో ఇసుక ధర ఒకటి.వైసీపీ ప్రభుత్వంలో ఇసుక టన్ను ధర వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలు వరకూ పలికింది. కొన్ని రోజులు బ్లాకులో అమ్మినప్పుడు కూడా టన్ను ధర 1400రూపాయలకు మించలేదు. కానీ ఇప్పుడు  ప్రభుత్వం అధికారకంగానే టన్ను ధర 1394 రూపాయలు నిర్ణయించడం పై తీవ్ర విమర్శలు ఎదురౌతున్నాయి. ఇసుక కావలసిన వాడి దృష్టి ఇప్పుడు ఒరిస్సా ఇసుక పై పడింది ట్రాన్సుపోర్టు చేరా టన్ను  1100 రూపాయలకే వచ్చేస్తోందట. ప్రభుత్వం మారిన ఇసుక సమస్య మరింత జటిలం కావడంతో ప్రజలు సతమతమవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమీక్షించి ఇసుక ధరను సామాన్యులకు అందుబాటులో వుంచాలని  కోరుతున్నారు.

Share