Current Date: 04 Jul, 2024

మరిడిమాంబ చుట్టూ "మైల" రాజకీయం

అంగరంగ వైభవంగా జరుగుతున్న  నర్సీపట్నం మరిడి మహాలక్ష్మి జాతర చుట్టూ "మైల రాజకీయం" నడుస్తున్నది. మూడేళ్లకోసారి, మూడు రోజులపాటు జరిగే జాతర మహోత్సవం సందర్భంగా, ఆదివారం ఆలయ ప్రాంగణంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. తమ కుటుంబానికి మైల ఉందంటూ అయ్యన్నపాత్రుడు కుటుంబీకులు, ఎవరూ గర్భగుడిలోకి ప్రవేశించలేదు. కానీ అదే కుటుంబంతో రక్తసంబంధం ఉన్న చింతకాయల సన్యాసి పాత్రుడు (జమీల్), ఆయన సతీమణి అనిత, గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో అయ్యన్నపాత్రుడు వర్గానికి చెందిన కొందరు జమీల్ తో వివాదానికి దిగారు. ఈ వ్యవహారం కాస్త తీవ్రస్థాయి దూషణలకు దారితీసింది. సోమవారం ఈ విషయంపై జమీల్ బలిఘట్టంలో విలేకరుల సమావేశం ఏర్పాటు  చేశారు. జమీల్ మాట్లాడుతూ, విజయ్ నీ కుటుంబం చరిత్ర మొత్తం బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ కుటుంబం అంటే మీ నాన్న కాదు, నువ్వు నీ భార్య గురించి నేను చెబితే ఊరు వదిలి పోతావో, ఏం చేసుకుంటావో ఆలోచించుకో, ఇంత దూరం వచ్చాక నేను వెనక్కి తగ్గేది లేదు, బ్రోకర్ నా కొడుకులు, హంతకులతో ఆలయంలో నన్ను తిట్టిస్తావా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరిడి మహాలక్ష్మి అమ్మవారు నర్సీపట్నం ప్రజల ఇలవేల్పు అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అయ్యన్నపాత్రుడు గర్భగుడిలోకి వెళ్లే అవకాశం లేదు.  నేను కూడా ఆలయంలోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో లేని మైల ను సృష్టించారని ఆరోపించారు. మైల ఉంటే నాకు అయ్యన్నపాత్రుడు కి ఉంటుందని, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అల్లిపూడి నుంచి మేము నర్సీపట్నం వచ్చేసామని, మేము మూడో తరమని ఎక్కడో అల్లిపూడి లో చనిపోయిన వారి పేరుతో మైల ఉన్నట్టు కొత్త డ్రామాకు విజయ్ తెరతీసాడని ఆరోపించారు. నా అన్న కొడుకు విజయ్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి, మా అన్న అయ్యన్నపాత్రుడు గ్రాఫ్ పడి పోయిందన్నారు. విజయ్ చేష్టలు   కారణంగా ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. నర్సీపట్నం ప్రజలకు అన్ని తెలుసని, ఎమ్మెల్యే ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్నాడని దుయ్య బట్టారు. నేను విమర్శలు చేస్తే ఎమ్మెల్యే గణేష్ అనడం ఏమిటని, దమ్ముంటే నాతో చర్చకు రావాలని అన్నారు. మా అన్నయ్య అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. ఆయన భార్య ,కొడుకే పెత్తనం చేస్తారని అన్నారు. ప్రజలంతా మరిడి మహాలక్ష్మి జాతర ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎక్కడ అల్లర్లు, గొడవలు, లేకుండా ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ వద్ద జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు.  రౌడీ మూ, దొంగలు, ఆలయం చుట్టుపక్కల ఉన్నారని ,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జమీలు హితవు పలికారు. ఒకవైపు అయ్యన్న తనయుడు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, మరిడి మాంబ జాతరను అడ్డుకోవడానికి అధికార పార్టీ నేతల ప్రయత్నాలు చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. పండుగను అడ్డుకుంటే ప్రజలు సహించరంటూ హెచ్చరించారు.  ఈ నేపథ్యంలో జిమీల్ ప్రెస్ మీట్ పెట్టి విజయ్ పై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. మొత్తం మీద మరిడి మహాలక్ష్మి జాతర చుట్టూ నడుస్తున్న "మైల రాజకీయం"  నర్సీపట్నం లో ఆసక్తికరంగా మారింది.