Current Date: 06 Oct, 2024

చంద్రబాబు ప్రమాణానికి వీల్ చెయిర్ లో వచ్చిన పులివర్తి నాని...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతల దాడిలో టీడీపీ నాయకుడు పులివర్తి నాని గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయాల నుంచి నాని ఇంకా కోలుకోలేదు. అయితే, తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పులివర్తి నాని హాజరయ్యారు. కాలికి పట్టీతో వీల్ చెయిర్ లో వచ్చారు. కేసరపల్లి సభావేదిక వద్దకు పులివర్తి నాని వీల్ చెయిర్ లో వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share