పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పేరు వినే ఉంటారు.. తాగి రోడ్డు మీద వాహనం నడిపితే ఈ టెస్ట్ నిర్వహిస్తారు.. కానీ మీరు ఎప్పుడైన డ్రండ్ అండ్ ఓటు టెస్టు పేరు విన్నారా... అవును మీరు చదివింది నిజమే డ్రంక్ అండ్ ఓటు.. ఎన్నికల్లో ఓటు వేసేముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటీషన్ సుప్రీం తిరస్కరించింది.
ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా మరియు దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి ఒక వ్యక్తికి ముందుగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు లోనయ్యేలా చూడాలని, భారత ఎన్నికల కమిషన్‌కు ఈ విధమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది జనవాహిని పార్టీ. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
పిటిషన్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ జనవాహిని పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను పరిశీలించి హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాడానికి నిరాకరిస్తున్నట్టు తెలిపింది.